గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల దాదాపు 660 చిత్రాలలో వివిధ రకాల పాటలు, పద్యాలు పాడి తన గళామృతాన్ని అందరికి పంచి, తన స్వస్థలమైన గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు. ఆయన పాడిన పాటలతో బాటు (ఆయా చిత్రాల యందు) ఇతరులు పాడిన పాటలను,గంధర్వ గాయకుని గళామృతానికి నోచుకోలేని చిత్రాలలోని పాటలు (అందుబాటులో ఉన్నంత వరకు) కూడా ఈ బ్లాగులో చూపించడం ద్వారా,గానాభిమానులను సంతృప్తి కలిగించాలనేదే నా ఈ ప్రయత్నం.*నీలి రంగులో ఉన్న పాటలు ఘంటసాల గారు (ఇతర గాయనీ గాయకులతో కలసి) పాడినవని గమనించగలరు. ఈ బ్లాగులోని ' చిత్రము, దర్శకత్వం, సంగీతం, తారాగణం, ఘంటసాల గారి పాటలు/పద్యాల కు సంబంధించిన వివరాలను శ్రీ చల్లా సుబ్బారాయుడు,కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, సంపాదకత్వంలో వెలువడిన 'ఘంటసాల గాన చరిత' నుండి గ్రహించినవి. సంకలన కర్త శ్రీ చల్లా సుబ్బారాయుడు గార్కి నా ధన్యవాదాలు.
ఘంటసాల గారి పాటలకు నోచుకోని సినిమా వివరాలను " ఘంటసాల పాటలు లేని సినిమాలు " అన్న శీర్షికన విడిగా చూపించడం జరిగింది. ఈ సినిమాలకు సంబందించిన వివరాలను అందుబాటులో ఉన్న పాటల పుస్తకాల ననుసరించి, కొందరు మిత్రులు అందించిన సమాచారం ఆధారంగా పొందుపరచడం జరిగినది.
No comments:
Post a Comment