గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల దాదాపు 660 పైచిలుకు చిత్రాలలో వివిధ రకాల పాటలు, పద్యాలు పాడి తన గళామృతాన్ని అందరికి పంచి, తన స్వస్థలమైన గంధర్వ లోకానికి తరలిపోయారు. ఆయన పాడిన పాటలతో బాటు (ఆయా చిత్రాల యందు) ఇతరులు పాడిన పాటలను,గంధర్వ గాయకుని గళామృతానికి నోచుకోలేని చిత్రాలలోని పాటలు (అందుబాటులో ఉన్నంత వరకు) కూడా ఈ బ్లాగులో చూపించడం ద్వారా,గానాభిమానులను సంతృప్తి కలిగించాలనేదే నా ఈ ప్రయత్నం.*నీలి రంగులో ఉన్న పాటలు ఘంటసాల గారు (ఇతర గాయనీ గాయకులతో కలసి) పాడినవని గమనించగలరు. ఘంటసాల గారి పాటలకు నోచుకోని సినిమా వివరాలను " ఘంటసాల పాటలు లేని సినిమాలు " అన్న శీర్షికన విడిగా చూపించడం జరిగింది. ఈ సినిమాలకు సంబందించిన వివరాలను, అందుబాటులో ఉన్న పాటల పుస్తకాల ననుసరించి, కొందరు మిత్రులు ముఖ్యంగా శ్రీ శ్యాం నారాయణ, గుంటూరు, అందించిన సమాచారం ఆధారంగా పొందుపరచడం జరిగినది. ఈ బ్లాగ్ డిజైన్ చేసిన శ్రీ కె. నరసింహ మూర్తి గారికి ( సఖియా మూర్తి గా వాసికెక్కారు ), ఈ బ్లాగ్ లోని చాలా సినిమాలకు పోస్టర్లు సమకూరుస్తున్న శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్, తదితర మాన్యుల కందరికీ నా కృతజ్ఞతలు.
1. veturi
ReplyDelete2. andale virisina, veturi, s janaki, spb
3. bhama vaddu, seethara sastry, p susheela, spb
4. laskula babu, seetharama satsry, s janaki, spb