Thursday, January 26, 2012

ఎర్రకోట వీరుడు - 1973


( విడుదల తేది: 16.12.1973 ఆదివారం )
టి.జి.కె. ఫిల్మ్స్ వారి 
దర్శకత్వం: దశరధరామిరెడ్డి
సంగీతం: ఘంటసాల విజయకుమార్ (ఘంటసాల గారి పెద్ద కుమారుడు)
తారాగణం: ఎన్.టి.రామారావు, నంబియార్, బి. సరొజాదేవి, సావిత్రి

01. అఆలు అన్నీ నువ్వు రాయాలి నా రాజా కన్నుల్లో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారే
03. కోయిలలే రాగం పాడెనులే తోటలో నెమళులు ఆడెనులే - పి.సుశీల - రచన: డా. సినారే
04. జవరాలు ఇది జవరాలు ఈ జాణకు ఇలలో సరిలేదు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
05. రేరాజా నీకు పగ ఏల చెలుని మదిలొ చెలిని - పి.సుశీల, ఘంటసాల - రచన: అనిసెట్టి 
06. సుందరి స్నేహం తీరని దాహం ఈ చెలి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
                                           
( నా పదహారవయేట తొలిసారిగా నేను సంగీత దర్శకత్వం వహించిన చిత్రం 'ఎర్రకోట వీరుడు - 1973'. ఈ చిత్రం పాటల రికార్డింగ్ వాహిని - ఎ ధియేటర్‌లొ జరిగింది. రికార్డింగ్ రోజున పాటలు పాడడానికి ప్రసిద్ద గాయని సుశీల గారితో ధియేటర్‌కి వచ్చిన మా నాన్నగారు - నాకు తండ్రినన్న విషయాన్ని మరచిపోయి ఒక గాయకుడుగా ' ఏం మ్యూజిక్ డైరెక్టర్ గారు! మాకు పాట చెప్తారా! ' అని అడిగారు. తాము గానం చెయ్యాల్సిన పాటలను నా ద్వారా నేర్చుకుని, గానం చేసి నన్ను సంతృప్తి పరిచారు. వృత్తిపరంగా గాయకుడుగా తన బాధ్యతనెరిగి సంగీత దర్శకుడుగా నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి - సమయోచిత ప్రవర్తన విషయంలో నాకు స్పూర్తిగా నిలిచారు మా నాన్నగారు --- ఘంటసాల విజయకుమార్) ( సేకరణ: ఘంటసాల గాన చరిత - పుట . 250)
===============================================================
                                                       - గమనిక -
ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారె రచయిత గాను, ఘంటసాల విజయకుమార్ సంగీత దర్శకుడుగాను   సినిమా లొ ఈ పాట ఉంది. 

ఇదే పాటను "పసిడి మనసులు - 1970 " చిత్రంలో ఉషశ్రీ రచయితగాను, సంగీతం అశ్వద్ధామ గాను ( పాటల పుస్తకము లోను ఉన్నది ) - ఈ విషయములో సంతృప్తికరమైన కరమైన సమాధానము అందుబాటులో లేదు -- 
No comments:

Post a Comment